ఒక ఊరిలో... ఫ్లాప్ అయినా రైడ్ తో మళ్లీ ఫామ్‌లో కి వచ్చాడు రమేష్ వర్మ. ఆ తరవాత వీర తీస్తే.. అది ఫ్లాప్ అయ్యింది. రాక్షసుడు హిట్ చేశాడు. ఇప్పుడు మరో ఫ్లాప్. ఖిలాడీ రూపంలో దక్కింది. రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. దీనిపై దాదాపు 50 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాడు నిర్మాత. విడుదలకు ముందే మంచి బిజినెస్ జరగడంతో.. నిర్మాత సేఫ్. అయితే డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ సినిమాని అందరికంటే ఎక్కువగా నిర్మాత కోనేరు సత్యనారాయణ నమ్మారు. అవుట్ పుట్ చూసిన వెంటనే దర్శకుడికి ఓ ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు... వంద కోట్ల విలువైన ఓ ప్రాజెక్టు అప్పగించాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో, కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వంద కోట్ల సినిమా ఎనౌన్స్ చేశారు. అయితే ఖిలాడీ ఫ్లాప్ తో ఇప్పుడు నిర్మాత అంత రిస్క్ చేస్తాడనుకోవడం సందేహమే.
అంతెందుకు...? నిన్నా మొన్నటి వరకూ రాక్షసుడుకి సీక్వెల్ గా రాక్షసుడు 2 తీద్దామన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా విరమించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రమేష్ వర్మ మాత్రం ఈ బ్యానర్‌లో.. తప్పకుండా మరో సినిమా ఉంటుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. ``ఖిలాడీ చూసి నిర్మాత హ్యాపీ. ఆడియన్స్ హ్యాపీ. నెగిటీవ్ రివ్యూలు వచ్చినంత మాత్రాన మేం ఫెయిల్ అయినట్టు కాదు`` అంటున్నాడు. మరి.. ఆడియన్స్ హ్యాపీ అయితే కలక్షన్లు ఉండాలి కదా. అవెందుకు లేవో..?