టాప్ హీరోయిన్స్ కి షాక్ ఇస్తున్న రమ్యకృష్ణ రెమ్యునరేషన్

By iQlikMovies - June 23, 2018 - 15:16 PM IST

మరిన్ని వార్తలు

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు స్టార్ సహాయనటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ పారితోషకం ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు. 

ఆ వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం ఆమె చేస్తున్న ఏ చిత్రానికైన రోజుకి ఇంత చొప్పున అనే పద్దతిలో ఆమె పారితోషకం తీసుకుంటున్నది. ఆ విధంగా ఆమెకి సుమారుగా రోజుకి రూ 6లక్షలు తీసుకుంటున్నదట! ఈ లెక్కనే సినిమాకి ఒక 25 రోజులు పనిచేసిన ఆమెకి సుమారు రూ 1కోటి 50 లక్షల వరకు లభిస్తున్నది. 

దీన్నిబట్టి ఈ తరంలో ఇంత స్థాయిలో పారితోషకం తీసుకుంటున్న సహాయనటిగా తన రేంజ్ ని చెప్పకనే చెబుతున్నది. ఆమె కెరీర్ కి బాహుబలిలోని శివగామి పాత్ర ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పాలి. ప్రస్తుతం రమ్యకృష్ణ తెలుగులో నాగ చైతన్య శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో ప్రాధాన పాత్రలో నటిస్తున్నది.   

అయితే ఆమె తన టాలెంట్, మార్కెట్ బట్టే పారితోషకం తీసుకుంటున్నది అని అయిన అలాంటి ప్రతిభ గల నటికి ఎంతిచ్చినా తప్పులేదు అని అంటున్న వారు కూడా లేకపోలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS