అక్కినేని బుల్లోడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు' ఫస్ట్‌లుక్ రిలీజయ్యింది. ఫస్ట్‌లుక్‌లో అత్తగా రమ్యకృష్ణ కుర్చీలో రాజసంగా కూర్చొని ఉండగా, పక్కనే అల్లుడు నాగచైతన్య, కూతురు అనూ ఇమ్మాన్యుయేల్ చిన్నగా రొమాన్స్ చేస్తున్నటుంది. అల్లుడి వైపు రమ్యకృష్ణ కోపంగా చూస్తోందీ లుక్‌లో.
ఈ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అత్త - అల్లుడు కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలకు ఒకప్పుడు భలే క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడలాంటి సబ్జెక్ట్స్‌ని ఎక్కువగా టచ్ చేయట్లేదు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత మారుతి ఈ సినిమా ద్వారా ఆ ఫార్ములాని సరికొత్తగా పరిచయం చేసేలా ఉన్నాడు. గతంలో నాగార్జున నటించిన 'అల్లరి అల్లుడు' చిత్రంలోని 'నిన్ను రోడ్డు మీద చూసినట్లు లగ్గాయత్తు..' సాంగ్ రీమేక్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో చైతూ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా స్టెప్పులేయనుంది.
ఇకపోతే చైతూ ఈ సినిమాలో కారు డ్రైవర్‌గానూ, డిటెక్టివ్ పాత్రలోనూ రెండు వేరియేషన్స్ చూపించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే మారుతి ఇంతవరకూ చేసిన సినిమాలన్నింట్లోనూ ఇదో విభిన్నమైన కాన్సెప్ట్‌గా రూపొందించబోతున్నాడట కూడా. అత్తా అల్లుళ్ల కాంబో అంటే ఆడియన్స్ ఆలోచన చాలా కామన్‌గా ఉంటుంది. అలా రెగ్యులర్ థాట్‌కి అందకుండా వైవిధ్యంగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాడట.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం చైతూ 'సవ్యసాచి' సినిమాలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.