గతంలో గ్లామర్ తారగా ఓ వెలుగు వెలిగి, 'నరసింహా', 'నీలాంబరి' తదితర చిత్రాల్లో ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్స్‌తో తనలోని పవర్‌ఫుల్ హావభావాల్ని ప్రత్యేకంగా పలికించిన రమ్యకృష్ణ టాలెంట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వాటన్నింటినీ కాలదన్నేలా ఆమె 'బాహుబలి'లో పోషించిన 'శివగామి' పాత్ర చెప్పుకోదగ్గది.
బాహుబలి పాత్రలో ప్రబాస్, దేవసేనగా అనుష్క, భళ్లాదేవగా రానాతో కలిపి సమానమైన ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర 'శివగామి'. ఓ పక్క మాతృత్వాన్ని, మరోపక్క రాణిగా రాజతంత్రాన్ని బాహుబలిలో ఒకేసారి చూపించిన శివగామి వీరత్వాన్ని ఫుల్ లెంగ్త్‌లో చూసే అవకాశం రాబోతోంది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 'మహారాణి శివగామి' టైటిల్‌తో ఓ సినిమా రాబోతోంది. మధు మిణకన్ గర్కి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మురళీకృష్ణ దబ్బుగుడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాహుబలి మాదిరిగానే ఇది కూడా సోషియో ఫాంటసీ చిత్రమే. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్, ఇంట్రెస్టింగ్ కథా, కథనాలతో సాగే చిత్రమిది. తాజాగా విడుదలైన రమ్యకృష్ణ ఫస్ట్‌లుక్‌ని బట్టి ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందనేది తెలిసిపోతోంది. శివగామిగా రమ్యకృష్ణ చాలా చాలా పవర్‌ఫుల్ పాత్ర పోషించబోతోందని అర్ధమవుతోంది. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలతో పాటు, మహారాణిగా ఆమె చూపించే రాజతంత్రాలు ప్రేక్షకుల్ని కట్టి పాడేస్తాయట.
మరోసారి తన నట విశ్వరూపం చూపించేందుకు త్వరలోనే 'శివగామి'గా రమ్యకృష్ణ ప్రేక్షకుల ముందుకు రానుంది.