సంపూర్ణేష్‌కీ సిక్స్‌ ప్యాక్‌ టైమొచ్చింది.!

మరిన్ని వార్తలు

బర్నింగ్‌ స్టార్‌ అంటూ సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌ అయిన సంపూర్ణేష్‌ బాబు హీరోగా తనకో స్పెషల్‌ స్టైల్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. ఒకే ఒక్క సినిమా 'హృదయ కాలేయం' తో ఎక్కడ లేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'సింగం 123', 'కొబ్బరి మట్ట' చిత్రాలు కూడా మంచి విజయాలందుకున్నాయి. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేశాయి. ఇక ఇప్పుడు ఆయన నాలుగో ప్రాజెక్ట్‌కి రంగం సిద్ధమైందట. ఆ ప్రాజెక్ట్‌ కోసం సంపూర్ణేష్‌ బాబు సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనున్నారట. ఇంతవరకూ ఆయన గెటప్పే ఆయనకు బలం. అదే ఆడియన్స్‌కి కిక్కు. అలాంటిది సిక్స్‌ ప్యాక్‌ సంపూర్ణేష్‌ బాబుని కూడా చూసే అవకాశం దక్కబోతోంది. ఇప్పుడున్న ఫిజిక్‌తోనే గ్రేస్‌ఫుల్‌గా డాన్సులు, జోష్‌గా ఫైట్లూ చేసేస్తుంటారాయన.

 

ఇక సిక్స్‌ప్యాక్‌ చేస్తే, ఏకంగా టాప్‌ హీరోలకీ పోటీ అయిపోతారేమో చూడాల మరి. జోక్‌ కాదండీ. క్రేజ్‌ అంటే అంతే మరి. అలాగే ఉంటుంది. ఒకప్పుడు 100 సినిమాలు చేస్తే ఇమేజ్‌, ఓ 90 హిట్లు కొడితే క్రేజ్‌. కానీ, ఇప్పుడలా లేదు కదా. ఒకటి, రెండు హిట్స్‌ కొడితే చాలు, ఏకంగా నెత్తిన పెట్టేసుకుంటున్నారు. కొంచెం ఓవర్‌ అయ్యిందంటారా? అదంతా పక్కన పెట్టేయండి. ఇక్కడున్నది మన సంపూర్ణేష్‌ బాబు. ఆయనలో ఏదో మ్యాజిక్‌ ఉంది. ఆ మ్యాజిక్‌తో ఆయన చేసే జిమ్మిక్కులు.. ఆ జిమ్మిక్కులతో వచ్చే కిక్కులే వేరప్పా. 

 

ఇంతకీ ఆయన చేయబోయే నాలుగో సినిమా వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. విడుదల కాకుండానే, 200 కోట్ల వసూళ్లు సాధించిన 'కొబ్బరి మట్ట' అని పోస్టర్‌ డిజైన్‌ చేయించుకున్న సత్తా ఆయనది. అలాగే, సెన్సేషన్‌ అయ్యేలా ఆయనే ఎప్పుడో అనౌన్స్‌మెంట్‌ ఇస్తారులెండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS