జనవరి 7న రావాల్సిన ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడింది. ఈ డేటు ఇప్పుడు ఖాళీగా ఉండడంతో.. రానా రంగంలోకి దిగిపోయాడు. రానా నటించిన `1945` సినిమాని ఈనెల 7న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సత్య శివ దర్శకత్వం వహించిన చిత్రమిది. సి.కల్యాణ్ నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయ్యింది. కానీ... కొన్ని ఇబ్బందుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబరు 31న ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు జనవరి 7న టార్గెట్ చేశారు.
నిజానికి జనవరి 7 మంచి డేట్. ఎందుకంటే ఆర్.ఆర్.ఆర్ వస్తుందేమో అని మిగిలిన సినిమాలు వాయిదా పడిపోయాయి. ఇప్పుడు ఆ డేట్ ఖాళీగా ఉంది. కాబట్టి..ఈజీగా రావొచ్చు. కాకపోతే... ఒకటే సమస్య. ఈసినిమా పబ్లిసిటీలో రానా కనిపించడు. నిర్మాతలకీ, రానాకీ మధ్య ఏదో ఇష్యూ నడుస్తోంది. అందుకే ఈ సినిమాని రానా ఎప్పుడో వదిలేశాడు.కనీసం డబ్బింగ్ కూడా చెప్పలేదు. ఇప్పుడు ప్రమోషన్లకూ రాడు. రానానే ఈ సినిమాని వదిలేశాడంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.