దాసరి తరవాత ఇండ్రస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరంటే... చిరంజీవి పేరు వినిపించింది. చిరు మాత్రమే అందుకు సమర్థుడు అన్నది చాలామంది నమ్మకం. చిరు కూడా.. తనంతట తానే ముందకొచ్చి కొన్ని సమస్యల్ని నెత్తి మీద వేసుకున్నాడు. ముఖ్యంగా కరోనా సమయంలో.. సీసీసీ ఏర్పాటు చేసి, కార్మికుల్ని ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇటీవల చిన్న సినిమాల ప్రమోషన్లలోనూ... చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఏ సమస్య వచ్చినా.. ముందు చిరు దగ్గరకే వెళ్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని చిత్రసీమ కలిసే విషయంలోనూ చిరునే చొరవ తీసుకున్నాడు. అలా.. దాసరి స్థానం దాదాపుగా ఆయన భర్తీ చేసేశారు.
అయితే ఇప్పుడు ఏమైందో.? పెద్ద రికంపై పెదవి విరుపు మాటలు మాట్లాడాడు చిరు. ఈరోజు... చిత్రసీమకు సంబంధించిన 24 విభాగాల వారికీ హైల్త్ కార్డుల్ని ఇష్యూచేసే కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా చిరు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తను ఇండ్రస్ట్రీ పెద్దగా ఉండదలచుకోలేదని, పంచాయితీలు చేయడం తనకు ఇష్టం లేదని, ఎవరికైనా సమస్య వస్తే, ఆదుకోవడానికి సిద్ధంగాఉంటానని, అంతే తప్ప, ఇండస్ట్రీ పెద్ద అనే కిరీటం తనకు వద్దని.. తేల్చేశాడు.
బహుశా.. ఈమధ్య జరిగిన కొన్ని ఘటనలు చిరుని బాగా బాధ పెట్టి ఉంటాయి. ఇటీవల జగన్ ని కలవాలనుకోవడం, ఆయన అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవడం తో చిరు బాగా ఫీలై ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా పంచాయితీల వల్ల, ఏదో పక్షానే నిలబడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మరో పక్షాన్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.చిరు ఎప్పుడూ అజాత శత్రువుగా ఉండాలన్న తపనతో కనిపిస్తాడు. అందుకే.. ఈ గోల ఎందుకని భావించి ఉండొచ్చు. పైగా ఇండ్రస్ట్రీ పెద్ద ఎవరన్న విషయంలో చిత్రసీమలో కొన్ని చర్చలు, వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి.చిరు అందుకు అర్హడని కొంతమంది అంటే, చిరు సరిపోడని ఇంకొంతమంది వాదిస్తున్నారు. ఇప్పుడు ఆ వాదనలూ తెరపడినట్టే.