‘బాహుబలి’ తర్వాత రానాకి ‘అరణ్య’ అంత స్పెషల్‌.!

మరిన్ని వార్తలు

ప్రస్తుతం మోస్ట్‌ బిజీయెస్ట్‌ యంగ్‌ హీరోగా రానా గురించి ఎక్కువే చెప్పుకోవాలి. ‘బాహుబలి’ సినిమాతో యూనివర్సల్‌ స్టార్‌ అయిపోయాడు. హీరో ప్రబాస్‌తో సమానమైన ఇమేజ్‌ దక్కించుకున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రబాస్‌ ఒకే ఒక్క సినిమాలో నటించగా, రానా మాత్రం చాలా సినిమాలనే లైన్‌లో పెట్టాడు. ‘బాహుబలి’ తర్వాత వెంటనే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేసి, సూపర్‌ హిట్‌ కొట్టడంతో పాటు, అంతవరకూ ఫామ్‌లో లేని తేజని ఫామ్‌లోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లో చంద్రబాబు నాయుడి పాత్రలో కనిపించి మెస్మరైజ్‌ చేశాడు. ఆ పై కూడా విరామం తీసుకోకుండా ‘హౌస్‌ఫుల్‌ 4’ తదితర హిందీ మూవీస్‌లో సత్తా చాటుతూనే ఉన్నాడు రానా.

 

ప్రస్తుతం రానా నటిస్తున్న ‘అరణ్య’ మూవీ అందరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఈ సినిమాని తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రానా చాలా చాలా కష్టపడ్డాడు. కొన్ని నెలల పాటు టెక్నాలజీకి, సాధారణ వాతావరణానికి దూరంగా అడవుల్లోనే ఏనుగుల గుంపుతో కలిసి జీవనం సాగించాడు. మొత్తానికి ‘అరణ్య’గా సరికొత్త రూపం దక్కించుకున్నాడు. ఏప్రిల్‌లో ఈ సినిమా రిలీజ్‌ కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్స్‌ గట్టిగా నిర్వహిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత రానా నుండి వస్తున్న బడా ప్రాజెక్ట్‌గా ‘అరణ్య’ను అభివర్ణిస్తున్నారు. ఇకపోతే, ఈ సినిమాతో పాటు, రానా చేతిలో మరిన్ని ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులుండడం విశేషం. వాటిలో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విరాట పర్వం’ ఒకటి.

 

ఈ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. మరోవైపు గుణశేఖర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘హిరణ్య కశ్యప’లోనూ రానా లీడ్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది ఈ సినిమా. అలాగే తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న మరో చిత్రం ‘1945’ కూడా రానా లిస్టులో ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS