కష్టపడ్డాను అంటున్న రానా!

మరిన్ని వార్తలు

కొందరు హీరోలు తమ పాత్రల కోసం ఎంతో కష్టపడతారు. పాత్రలో సహజత్వం కోసం ఎంతటి శ్రమకైనా వెనుకాడరు. రానా దగ్గుబాటి కూడా అలాంటి నటుడే. సినిమాల్లో తన క్యారెక్టర్ కోసం బరువు తగ్గడం, పెరగడం లాంటివి ఎన్నో సార్లు చేశారు. తాజాగా 'అరణ్య' సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో వెల్లడించారు.

 

ఈ సినిమా అడవి నేపథ్యంలో జంతువుల మధ్యలో సాగుతుంది. ఏనుగులతో చాలా సీన్లు చిత్రీకరణ జరిపారట. అయితే ఏనుగులతో కలిసి నటించడం ఆషామాషీ కాదని చెప్పుకొచ్చారు రానా. ఇంతవరకూ రానా నటించిన సినిమాల్లో చాలా కష్టపడింది ఈ సినిమా కోసమేనట. ఎందుకంటే కొన్ని సన్నివేశాలలో ఏనుగు తొండాన్ని రానా భుజాలపై పెట్టుకోవాల్సి వచ్చేదట. ఇక్కడ సమస్య ఏంటంటే ఏనుగు తొండం బరువు ఏకంగా 160-170 కిలోలు ఉంటుందట. అంత బరువును భుజాలపై మోస్తూ ఎమోషన్లు పలికించాలంటే ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.

 

ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2 న విడుదల చేసేందుకు ప్లాన్ చేసినప్పటికీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS