అవును. రానా త్వరలోనే నక్సలైట్లలో కలిసిపోతున్నాడు. అడవుల్లోకి వెళ్లి... కామ్రేడ్‌గా మారబోతున్నాడు. రానా ఏంటి? నక్సలిజం ఏమిటి? ఏమైనా లింకు ఉందా? అనుకుంటున్నారా?? అక్కడికే వస్తున్నాం. రానా కథానాయకుడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి కథానాయిక. ఈ చిత్రానికి విరాఠ పర్వం అనే పేరు పరిశీనలలో ఉంది. ఇందులో రానా నక్సలైట్‌గా కనిపించబోతున్నాడని సమాచారం.
ఎమర్జన్సీ నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పట్లో నక్సల్‌బరి ఉద్యమం ఉదృతంగా సాగింది. భూటకపు ఎన్‌కౌంటర్లు చాలా జరిగాయి. మానవ హక్కుల ఉద్యమాలు ఎన్నో జరిగాయి. ఇదంతా.. ఈ సినిమాలో చూపించనున్నారట. ఈ సినిమా కోసం టబుని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఆమె మానవ హక్కుల ఉద్యమ నేతగా కనిపించనున్నదని సమాచారం. జూన్ జులైలలో ఈసినిమా పట్టాలెక్కబోతోంది.