బాహుబలితో రానా ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే తెలుగు, హిందీ మార్కెట్లకు పరిచయం అయిన రానా... తమిళ, కన్నడ చిత్రసీమల్నీ బాగా ఆకర్షించాడు. ఇప్పుడో కన్నడ ప్రాజెక్టు రానా తలుపు తట్టింది. రాజీవ్ గాంధీ హత్యోదంతం నేపథ్యంలో కన్నడ లో ఓ చిత్రం తెరకెక్కనుంది. రమేష్దర్శకత్వం వహిస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, హింది భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రానా సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం. రాజీవ్ గాంధీ హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసుని దర్యాప్తు చేసిన ఓ సీబీఐ పోలీస్ అధికారి జీవితం నేపథ్యంలో ఈ సినిమా సాగబోతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.