మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరూ రీమేకులపై పడ్డారు. మలయాళంలో ఘన విజయం సాధించిన `లూసీఫర్`ని చిరు, `అయ్యప్పయుమ్ కోషియమ్`ని పవన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. లూసీఫర్‌కి వినాయక్ దర్శకత్వం వహిస్తాడు. `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్.. సాగర్ చంద్రకు అప్పగించారు. అయితే ఈ రెండు రీమేకుల్లోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ రానా నటిస్తాడట.
`అయ్యప్పయుమ్..` ఓ మల్టీస్టారర్ సినిమా. మలయాళంలో బీజూమీనన్, పృథ్వీరాజ్ కలిసి నటించారు. బీజూ మీనన్ పాత్రలో పవన్ నటించడం ఖాయం అయ్యింది. ఫృథ్వీరాజ్ పాత్రలో.. రానా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రానా పేరు అధికారికంగా ప్రకటిస్తారు. ఇప్పుడు `లూసీఫర్`లోనూ రానాకి ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. `లూసీఫర్` సెకండాఫ్‌లో ఓ గెస్ట్ రోల్ లాంటిది ఉంటుంది. అందులోనూ.. పృథ్వీరాజే నటించారు. ఆ పాత్ర కోసం రానాని ఎంచుకోబోతున్నారని సమాచారం.
`లూసీఫర్` లో ఫృథ్వీరాజ్ పాత్ర పరిధి తక్కువ. కానీ.. రానా కోసం దాన్ని పెంచుతున్నార్ట. మొత్తానికి అన్నా, దమ్ముల సినిమాలు రెండింటిలోనూ.. రానానే ఎంచుకోవాలని చూస్తున్నారు. రెండు చోట్ల.. పృథ్వీరాజ్ చేసిన పాత్రే కావడం మరో విశేషం.