టీజర్‌ టాక్‌: మళ్లీ అదరగొట్టేసిన రానా!

మరిన్ని వార్తలు

రానా ప్రధాన పాత్రలో నటించిన బహుభాషా చిత్రం ‘హాథీ మేరీ సాథీ’ టీజర్‌ వెరీ లేటెస్ట్‌గా రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో అడవి బిడ్డలా రానా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఏనుగుల గుంపుకు రాజులా కనిపించనున్నాడు. దాదాపు టార్జాన్‌ పాత్రన్నమాట. అడవినే నమ్ముకుని బతికే ఈ అడవి బిడ్డకి, మనుషుల నుండి ఎటువంటి కష్టాలు ఎదురయ్యాయి? తన అడవి జోలికి వస్తే ఈ అడవి బిడ్డ ఏం చేశాడు అన్నదే కథాంశం. గతంలో ఇలాంటి నేపథ్యంలో చాలా సినిమాలు తెరకెక్కినా ఈ సినిమాలో ఏదో కొత్త విషయం ఉందని టీజర్‌ ద్వారా తెలుస్తోంది. రానాతో పాటు, తమిళ నటుడు విష్ణు విశాల్‌, సామ్రాట్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'ప్రభు సోల్మన్' దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రియ, జోయ హుస్సేన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమాని విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం కేరళ అడవుల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాని తెలుగులో ‘అరణ్య’ టైటిల్‌తోనూ, తమిళంలో ‘కాదన్‌’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇంతవరకూ ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి కలిగించిన రానా, తాజా టీజర్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. అద్భుతమైన నటన కనబరిచాడు. టార్జాన్‌లా జంతువులూ, పక్షులకు మాత్రమే అర్ధమయ్యే ఓ రకమైన భాషలో మాట్లాడుతున్నట్లుగా విచిత్రమైన హావభావాలు ప్రదర్శిస్తున్న రానా లుక్స్‌తో టీజర్‌ స్టార్ట్‌ అయ్యింది. ‘నువ్వెవరు.. దేవుడివా.? అని బ్యాక్‌ గ్రౌండ్‌లో ఓ వాయిస్‌, ‘బల్‌దేవ్‌’ అని రానా సమాధానం ఆ వెనకే గాండ్రిస్తున్న పులి.. తర్వాత ఓ పెద్ద ఏనుగుల గుంపును వెంటేసుకుని దూకుడుగా రానా నడిచొస్తున్న అద్భుతమైన దృశ్యంతో టీజర్‌ ఎండ్‌ చేశారు. 

 

మొత్తానికి మన భళ్లాలదేవుడు, ‘బల్‌ దేవ్‌’గా అడవిలో గట్టి పోరాటాలు చేయనున్నాడని ‘హాథీ మేరీ సాథీ’ టీజర్‌ ద్వారా అర్ధమవుతోందన్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS