రాజ‌మౌళి ప్లానింగ్‌.. చిరుకి న‌చ్చ‌లేదా?

మరిన్ని వార్తలు

రామ్ చర‌ణ్ సినిమా అంటే.. చిరంజీవి జోక్యం త‌ప్ప‌నిస‌రి. `చిరుత‌` నుంచీ...చ‌ర‌ణ్ సినిమాల‌పై చిరు ప్ర‌భావం క‌నిపిస్తూనే ఉంటుంది. చ‌ర‌ణ్ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో చిరునే నిర్ణ‌యాలు తీసుకుంటారు. అయితే.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` విష‌యంలో ఇదేం జ‌ర‌గ‌డం లేదు. ఇది రాజ‌మౌళి సినిమా. త‌న ప్లానింగులు త‌న‌వే. అక్క‌డే రాజ‌మౌళికీ, చిరంజీవికీ మ‌ధ్య క్లాష్ వ‌స్తోంది. తాజాగా `ఆర్‌.ఆర్.ఆర్` రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేశాడు రాజ‌మౌళి. 2021 సంక్రాంతికి వ‌స్తున్నామ‌ని చెప్పేశాడు. అయితే ఈ విష‌యం చిరుకి ముందు తెలీలేద‌ట‌. త‌న 152వ సినిమా `ఆచార్య‌`ని సంక్రాంతికే తీసుకొద్దామ‌ని భావించాడు చిరు. అయితే ఇప్పుడు అది సాధ్యం కావ‌డం లేదు.

 

2021 సంక్రాంతికి వ‌స్తున్నామ‌ని ముందు తెలిస్తే... త‌న సినిమా విష‌యంలో జాగ్ర‌త్త ప‌డే అవ‌కాశం ఉండేద‌ని చిరు భావిస్తున్నాడు. చ‌ర‌ణ్ సినిమాకీ, త‌న సినిమాకీ మ‌ధ్య క‌నీసం 4 నెల‌ల విరామం అయినా ఉండాల‌ని చిరు అనుకున్నాడు. 2021 సంక్రాంతికి చ‌ర‌ణ్‌సినిమా వ‌స్తే..  వేస‌వికి గానీ చిరు సినిమా రావ‌డానికి లేదు. ముందు విడుద‌ల చేద్దామంటే అప్ప‌టికి త‌న సినిమా రెడీ కాదు. దాంతో చిరు బాగా అప్ సెట్ అయిన‌ట్టు తెలుస్తోంది. అయినా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. అందుకే.. ఆచార్య సినిమాని వీలైనంత త్వ‌ర‌గా ఫినిష్ చేద్దామ‌ని భావిస్తున్నాడ‌ట చిరు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS