అక్షయ్‌కుమార్‌తో రెండోస్సారి - రానా

By iQlikMovies - November 02, 2018 - 15:26 PM IST

మరిన్ని వార్తలు

ఓ వైపు తెలుగులో చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది ముద్దుగుమ్మ పూజా హెగ్దే. మరోవైపు కామ్‌గా బాలీవుడ్‌ని చక్కబెట్టేస్తోంది. బాలీవుడ్‌లో 'హౌస్‌ఫుల్‌ 4' సినిమాలో పూజా హెగ్దే వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌గా నటిస్తోంది. 'హౌస్‌ఫుల్‌' సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. ఇప్పుడొస్తున్న నాలుగో సిరీస్‌లో పూజాహెగ్దే నటిస్తోంది. 

ఆల్రెడీ బాలీవుడ్‌లో 'మొహంజోదారో' సినిమాలో నటించింది పూజా హెగ్దే. ఆ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందించలేదు అది వేరే సంగతి. ఇకపోతే ఈ సినిమాలో తాజాగా భళ్లాలదేవ రానా ఎంట్రీ కూడా జరిగింది. 'మీ టూ' మూమెంట్‌ పేరు చెప్పి, ఈ సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించాల్సిన నానా పటేకర్‌ తప్పుకోవడంతో ఆ ఛాన్స్‌ రానాని వరించింది. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అది. ముంబయ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌లో రానా పాల్గొన్నాడు. 

అక్షయ్‌కుమార్‌, రితీష్‌ దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్‌, కృతికర్బందా, కృతిసనన్‌, పూజా హెగ్దే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రానా విలన్‌గా నటిస్తున్నాడు. ఆల్రెడీ బాలీవుడ్‌లో సినిమాలు చేసిన అనుభవం ఉంది రానాకి. గతంలో అక్షయ్‌కుమార్‌, తాప్సీ కాంబినేషన్‌లో వచ్చిన 'బేబీ' సినిమాలో రానా నటించాడు. అలా రెండోసారి అక్షయ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు 'హౌస్‌ఫుల్‌ 4'తో. 

మరోవైపు రానా తెలుగులో 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో నారా చంద్రబాబుగా ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నాడు. అలాగే తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న '1945' చిత్రంలోనూ, హిందీలో 'హాథీ మేరీ సాతీ' తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS