రానా పెళ్లి అక్క‌డే!

మరిన్ని వార్తలు

టాలీవుడ్లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అయిన‌ రానా పెళ్లి నిశ్చియ‌మైన సంగ‌తి తెలిసిన విష‌య‌మే. మిహీకా బ‌జాజ్‌తో రానా పెళ్లి ఖాయ‌మైంది. ఆగ‌స్ట్ 8న రానా - మిహీకీల వివాహం ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు పెళ్లి వేడుక కూడా ఖ‌రారైంది. హైద‌రాబాద్‌లోని తాజ్ ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో రానా పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ట‌.

 

మిహికా ఓ ఈవెంట్ మేనేజ‌ర్‌. ఎన్నో వందల పెళ్లిళ్ల‌ను చేసిన అనుభ‌వం ఉంది. ఈపెళ్లి ఏర్పాట్లు కూడా తానే చేసుకుంటోంద‌ట‌. లాక్ డౌన్‌లో జ‌రుగుతున్న పెళ్లి ఇది. పెళ్లి, వేడుక‌ల విష‌యంలో ప్ర‌భుత్వం కొన్ని ప‌రిమితుల్ని విధించింది. ఈ పెళ్లి కూడా ఆ ప‌రిమితుల మ‌ధ్య జ‌ర‌గ‌బోతోంద‌ని తెలుస్తోంది. పెళ్లికి కేవ‌లం అతి త‌క్కువ‌మంది అతిథులే హాజ‌రు కానున్నార్ట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS