తమిళ సినిమాలపై మోజుతోనో, తెలుగులో సరైన పాత్రలు దక్కడం లేదన్న కారణంతోనో టాలీవుడ్‌కి దూరమైంది నయనతార. బాలకృష్ణ, చిరంజీవి లాంటి అగ్ర కథానాయకులు అడిగితే తప్ప, టాలీవుడ్ వైపు కన్నెత్తి చూసేది కాదు. అయితే ఇప్పుడు కాస్త పట్టు సడలించింది. తెలుగు సినిమాలపై తనుకూడా దృష్టి పెట్టింది. తాజాగా మరో తెలుగు సినిమాకి సంతకం చేసినట్టు తెలుస్తోంది. రానా నిర్మాతగా ఓ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది.
ఇదో లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఓ కొరియన్ కథ ఆధారంగా తెరకెక్కబోతోంది. ఇందులో కథానాయికగా నయనతారని ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రానా నటిస్తాడా, లేదంటే కేవలం నిర్మాతగానే ఉంటాడా? అనేది తెలియాల్సివుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఈసినిమా కోసం నయనతారకు రూ.5 కోట్ల పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం అందుతోంది.