రానా 'ఎటాక్‌' చేస్తానంటున్నాడు

మరిన్ని వార్తలు

రానా, తేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేసిన నాటి నుండీ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. విడుదలైన ప్రతీ పోస్టర్‌ సినిమాకి సంబంధించిన ఏదో కొత్త విషయాన్ని తెలియ చెబుతోంది. తాజాగా ఓ పోస్టర్‌ విడుదల చేశారు. 'జోగేంద్రాస్‌ లవ్‌ ఫర్‌ రాధ, మేడ్‌ హిమ్‌ బ్రూటల్‌' అనే పోస్టర్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో హీరో రానా పంచెకట్టుతో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఈ సినిమాలో రాధగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. కాజల్‌ ప్రేమ కోసమే జోగేంద్ర అంత క్రూయల్‌గా మారిపోతాడా? మొదట్లో ఇదేదో పొలిటికల్‌ డ్రామా అనుకున్నారంతా. రానా ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమాలో. అలాగే డైలాగ్‌ పంచెస్‌ కూడా రాజకీయ నేపధ్యంలో ఉండడంతో ఆ భావన కలిగింది. అయితే ఈ తాజా పోస్టర్‌ వచ్చాక, ఇదేదో రివేంజ్‌ డ్రామాలా అనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమాతో రానా చాలా క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నాడు. సినిమాపై అంచనాలు కూడా బావున్నాయి. డైరెక్టర్‌గా తేజకి ఈ మధ్య అంతగా హిట్స్‌ లేవు. కానీ ఈ సినిమాతో మళ్లీ ఏదో మ్యాజిక్‌ చేయనున్నాడు తేజ అని తెలుస్తోంది. కేథరీన్‌ ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగష్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS