టాలీవుడ్లో ప్రేమ కబుర్లు మామూలే. ఫలానా హీరో.. ఫలానా హీరోయిన్‌తో క్లోజ్ గా ఉన్నాడని, వారిద్దరి మధ్య ఏదో ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందని వార్తలు వస్తూనే ఉంటాయి. రకుల్ ప్రీత్ సింగ్‌పైనా ఇలాంటి రూమర్లు పుట్టాయి. వాటిలో ఎక్కువగా వినిపించిన పేరు రానా. తనతో రకుల్ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే... గాసిప్పులు మాత్రం కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి. వీటిపై పెదవి విప్పింది రకుల్. చిత్రసీమలో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని, అందులో రానా ఒకడని క్లారిటీ ఇచ్చింది.
రానా చిత్రసీమలో అడుగుపెట్టినప్పటి నుంచీ తనకు తెలుసని, చాలా విషయాల్లో చేదోడు వాదోడులా ఉంటాడని చెప్పుకొచ్చింది. అంతే కాదు.. తమ ఇల్లులు పక్కపక్కనే అని, అందుకే మరింత సన్నిహితంగా ఉంటామని అంది. ఈరోజుల్లో ప్రేమకు అర్థం మారిపోయిందని, అయినాతాను ప్రేమించే పరిస్థితుల్లో లేనని, తనకు అంత సమయం కూడా లేదని, ఇప్పటికీ ఒంటరిదాన్నే అని కుండ బద్దలు కొట్టేసింది. సో... ఈ స్నేహాన్ని స్నేహంగానే అర్థం చేసుకుంటే మంచిదన్నమాట.