రానా హీరోగా ఓ కొత్త సినిమా వస్తోంది. అదే '1945'. సైలెంట్‌గా సినిమాలు చేసేస్తూ ఉంటాడు రానా. అవి కూడా అలాంటి ఇలాంటి సినిమాలు కావు. దేనికవే ప్రత్యేకమైనవే. గతంలో రానా హీరోగా 'ఘాజీ' సినిమా వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ఎవరికీ తెలీదు. రిలీజ్ అయ్యాక ఓ సెన్సేషన్ అయ్యింది. అయినా కానీ ఆ సినిమాని జనం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మరోసారి రానా అదే తరహా కంటెన్ట్ ఉన్న సినిమాతో వస్తున్నాడు. స్వాతంత్య్రోదమానికి ముందు అసలు ఏం జరిగింది.. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనలను హైలెట్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సత్యశివ ఈ సినిమాకి దర్శకుడు. కాగా రానా విషయానికి వస్తే, కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఏదో తొందరపడి సినిమాలు చేసేయకుండా, కంటెన్ట్‌లో కొత్తదనం వెతుకుతాడు. రానా కటౌట్‌కి ఆ కథలు కూడా అచ్చం అలా సూట్ అయిపోతూ ఉంటాయి. అందుకే డిఫరెంట్ కథలతో, డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో హిట్టు మీద హిట్టు కొట్టుకెళ్లిపోతున్నాడు. స్టార్ హీరో ఇమేజ్‌ని పట్టించుకోకుండా, ఇమేజ్ చట్రంలో అస్సలు ఇరుక్కోకుండా, ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. నిజానికి ఓ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు రానా. కావాలంటే ఎన్నో కమర్షియల్ సినిమాలు చేయొచ్చు. కానీ అలా చేయకుండా, కొత్త కొత్త ఆలోచనలతో కొత్త దారిలో నడుస్తూ రానా ఈజ్ వెరీ వెరీ స్పెషల్ అనిపించుకుంటున్నాడు. ఈ విషయంలో రానాని అభినందించకుండా ఉండలేం. ప్రస్తుతం చేస్తున్న '1945' సినిమాలో సైనికుడి పాత్రలో కనిపిస్తున్నాడు రానా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు రానా.