రానా-సాయి పల్లవిల జోడికి రంగం సిద్ధం

మరిన్ని వార్తలు

నీది నాది ఒకే కథ సినిమాతో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న దర్శకుడు వేణు ఉడుగుల. తన తొలిచిత్రంతోనే మంచి విజయం అందుకున్న ఈయన నుండి మరొక చిత్రం ఎప్పుడు వస్తుందా అన్న ప్రశ్నకి సమాధానం తాజా ప్రకటనతో చెప్పేశాడు.

అందుతున్న వివరాల ప్రకారం, వేణు తాజాగా ఒక కథ సిద్ధం చేశాడు అని ఆ కథని రానా & సాయి పల్లవిలకి చెప్పడం వారు ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. ఈ చిత్రాన్ని చెరుకు సుధాకర్ నిర్మించనున్నట్టుగా తెలిసింది.

ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న రానా తన తదుపరి చిత్రంగా ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇదేసమయంలో బాలీవుడ్ లో సైతం హౌస్ ఫుల్ 4 చిత్రంలో ఒక కీలక పాత్ర దక్కించుకున్నాడు.

ఇక సాయి పల్లవి విషయానికి వస్తే, MCA & కణం చిత్రాల తరువాత ఆమె నుండి వస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మంచి సినిమా తీయగలడు అన్న నమ్మకం సంపాదించుకున్న వేణు ఈ సినిమా ఎలా తీయబోతున్నాడు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS