భయపెట్టేస్తానంటోన్న యంగ్‌హీరో.!

By iQlikMovies - November 01, 2018 - 16:30 PM IST

మరిన్ని వార్తలు

'అంతకుముందు ఆ తర్వాత', 'కేరింత', ఇటీవల మెగా డాటర్‌ నిహారికతో 'హ్యాపీ వెడ్డింగ్‌' వంటి చిత్రాల్లో నటించిన యంగ్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ కొత్త ట్రాకెక్కాడు. లవర్‌ బోయ్‌ ఇమేజ్‌తో అమ్మాయిల మనుసుల్ని కొల్లగొట్టిన ఈ బుల్లోడు ఇప్పుడు ఓ కొత్త కథాంశాన్ని ఎంచుకున్నాడు. హారర్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. 

'దండుపాళ్యం' సిరీస్‌తో అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించిన డైరెక్టర్‌ శ్రీనివాసరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పక్కా హారర్‌ మూవీ. అసలు సిసలు హారర్‌ని ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నారట. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందట. అందుకే మ్యూజిక్‌ గాడ్‌ ఫాదర్‌ మణిశర్మను ఈ సినిమాకి మ్యూజిక్‌ కోసం ఎంచుకున్నారు. అంతేకాదు సినిమాని భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించబోతున్నారట. సుమంత్‌ అశ్విన్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా రూపొందబోతోంది. 

అలాగే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. నవంబర్‌ రెండో వారంలో చిత్రం సెట్స్‌ మీదికెళ్లనుంది. 'గరుడవేగ' చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న ఎం.కోటేశ్వరరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ హారర్‌ థ్రిల్లర్‌ మూవీతో సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నెక్ట్స్‌ లెవల్‌ని అందుకుంటాడేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS