ఫాన్స్ కి టెన్షన్‌ పెంచేస్తోన్న రానా.!

మరిన్ని వార్తలు

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు రానా అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధితో రానా బాధపడుతున్నాడనీ గాసిప్స్‌ ఈ మధ్య తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ గాసిప్స్‌ని గతంలోనే రానా తండ్రి ప్రముఖ నిర్మాత అయిన సురేష్‌బాబు ఖండించారు. 

తాజాగా ఈ వార్తపై రానా కూడా స్సందించాడు. తనకెలాంటి తీవ్రమైన వ్యాధులు లేవనీ, అయితే కంటికి సంబంధించిన చిన్న ప్రాబ్లెమ్‌ ఉంది. అది చిన్నతనం నుండీ ఉన్న సమస్యే. ఆ సమస్యకే సర్జరీ చేయించుకోబోతున్నాను. అందుకే సిద్ధపడుతున్నాను. అయినా ఇది చాలా చిన్న సమస్యే. దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన పని లేదు, ఈ అనవరసర గాసిప్స్‌ వల్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారనీ రానా అన్నాడు. 

అయితే ఈ సర్జరీ కోసం రానాకి కొద్దిగా బీపీ తగ్గాల్సి ఉందట అంతే. త్వరలోనే కంటి సర్జరీ జరుగనుంది. సర్జరీ తర్వాత కొన్ని రోజులు రెస్ట్‌ తీసుకుని, మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటానని రానా చెప్పాడు. ఇదిలా ఉంటే, రానా చేతిలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. టాలీవుడ్‌తో పాటు, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో కూడా రానా బిజీగా సినిమాలు చేస్తుంటాడు. 

హీరోగానే కాకుండా, క్యారెక్టర్‌ నచ్చితే గెస్ట్‌ రోల్స్‌కైనా ఓకే చెప్పేస్తాడు. రానా కెరీర్‌లో 'బాహుబలి'లోని 'భళ్లాలదేవ' పాత్ర రానా స్టార్‌డమ్‌ని పెంచేసింది. సినిమాల దారి సినిమాలదే. మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ రానా యాక్టివ్‌గా కనిపిస్తాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS