వెంకీ, వరుణ్‌ తోడళ్లుళ్లట.!

By iQlikMovies - June 19, 2018 - 14:21 PM IST

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అభిరుచి గల నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. 

కాగా ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా, అందాల మెహ్రీన్‌ వెంకీకి, వరుణ్‌కి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఈ సినిమాలో అక్కచెల్లెళ్లుగా కనిపించనున్నారట. ఈ అక్కచెల్లెళ్లకు భర్తల పాత్రల్లో వెంకీ, వరుణ్‌ నటిస్తున్నారట. లేటెస్టుగా సినిమాకి సంబంధించిన ఈ సీక్రెట్‌ రివీల్‌ అయ్యింది. 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పెళ్లి తర్వాత మగవాళ్లు ఎలాంటి ఫ్రస్టేషన్‌ ఫీలవుతారు.. అనే అంశాన్ని ఫన్‌ మిక్స్‌ చేసి చూపించబోతున్నారట. 

అనిల్‌ రావిపూడి సినిమాల్లో కామెడీ ట్రాక్‌ గురించి తెలిసిందే. 'పటాస్‌', 'సుప్రీమ్‌', 'రాజా ది గ్రేట్‌' సినిమాలతో డైరెక్టర్‌గా అనిల్‌ సత్తా చాటడంతో పాటు, మూడు సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ సీరియస్‌ కాన్సెప్ట్‌కి కామెడీ మిక్స్‌ చేసి, ఎంత సమర్ధవంతంగా సక్సెస్‌ని అందుకోవచ్చో ఈ జనరేషన్‌ డైరెక్టర్స్‌లో అనిల్‌కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ సినిమాతో కూడా సమ్‌థింగ్‌ కొత్తగా ఎంటర్‌టైన్‌ చేస్తానంటున్నాడు. 

వెంకీ కామెడీ టైమింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఫ్యామిలీ కాన్సెప్ట్‌ల్లో విశ్వరూపం చూపిస్తాడు. అయితే కామెడీ పరంగా వరుణ్‌తేజ్‌లోని న్యూ యాంగిల్‌ని ఈ సినిమా ద్వారా చూడబోతున్నామన్న మాట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోందీ చిత్రం. వరుణ్‌తేజ్‌ మరోవైపు సంకల్ప్‌రెడ్డితో 'అంతరిక్షం' సినిమాలో నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS