అమెరికాలో తెలుగు జంట నిర్వహించిన సెక్స్ రాకెట్ గుట్టురట్టవడం ఆ తరువాత పరిణామాలలో తెలుగు సినీ పరిశ్రమలో ఉండే కొంతమందికి దానికి సంబంధాలు ఉన్నాయి అంటూ వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి. దానికితోడు నటి మెహ్రీన్ ని కూడా ఈ మధ్యనే అమెరికా పోలీసులు విచారించడంతో అందరిలోనూ ఒకలాంటి ఆందోళన మొదలైంది.
ఇక తాజాగా ఈ కేసుకి సంబందించి ఇంటర్ పోల్ అధికారులు యాంకర్ అనసూయని విచారించినట్టుగా ఒక వార్త ఇప్పుడు బయటికొచ్చింది. అయితే దీనిని అనసూయ ద్రువీకరించాల్సి ఉంది. ఈ సెక్స్ రాకెట్ కి సంబంధించి పలువురుని విచారించనున్నట్టుగా సమాచారం ఉన్నందున తెలుగు యాంకర్స్ తో పాటుగా కొంతమంది హీరోయిన్లని ఇంటర్ పోల్ అధికారులు ముందుకి వెళ్ళనున్నారు.
దీన్నిబట్టి ఈ విచారణ లిస్టులో ఎవరెవరు చేరబోతున్నారు అన్నదాని పైన ఇంకొన్ని రోజులలో క్లారిటీ రానుంది. మొన్నీమద్యేనే కాస్టింగ్ కౌచ్ వంటి అంశాలతో ఊపిరాడకుండా ఇబ్బందులు పడ్డ తెలుగు చిత్ర పరిశ్రమకి ఇది మరొక తలనోప్పిలా మారే అవకాశం ఉంది.