సాయిపల్లవి ఫినిష్‌ చేసింది, మరి రానా సంగతేంటబ్బా!

మరిన్ని వార్తలు

రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'విరాట పర్వం'. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, ఈ షూటింగ్‌లో రానా మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే రానా కొన్నాళ్లుగా విదేశాల్లో ఉన్నాడు. అనారోగ్య రీత్యా అక్కడ ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటున్నాడనీ, లేదు, లేదు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడంటూ పలు రకాల వార్తలు గాసిప్స్‌ రూపంలో గుప్పుమంటున్నాయి. కానీ, అసలు వాస్తవం ఏంటో క్లియర్‌గా తెలీదు.

 

నిజానికి సౌత్‌ హీరోల్లో రానా సో బిజీ. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు, బాలీవుడ్‌, హాలీవుడ్‌నీ చక్కబెట్టేసి వస్తున్నాడు. రానా నటిస్తున్న 'హాథీ మేరీ సాథీ' చిత్రం సెట్స్‌పై ఉంది. ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌ నుండి రానా ఫోటోలు గతంలో కొన్ని లీక్‌ అయిన సంగతి తెలిసిందే. వీటితో పాటు, ఓ ఇంగ్లీష్‌ మూవీలో కూడా రానా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తెలుగు విషయానికి వస్తే, రానా నటిస్తున్న 'విరాటపర్వం' సినిమాలో ఇంతవరకూ హీరోయిన్‌ సాయి పల్లవి, ఇతర కీలక ఆర్టిస్టులపై వచ్చే సన్నివేశాల చిత్రీకరణ ఆల్రెడీ పూర్తయిపోయిందట.

 

ఇక రానా కోసమే చిత్రయూనిట్‌ వెయిట్‌ చేస్తోందట. రానా విదేశాల నుండి తిరిగి రాగానే ఆయనపై వచ్చే సీన్స్‌ చిత్రీకరణ కూడా పూర్తి చేయనున్నారట. త్వరలోనే రానా షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడనీ తెలుస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 1990 నాటి నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది. సాయి పల్లవి ఓ జానపద గాయనిగా కనిపించనుందీ సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS