భళ్లాలదేవ హిప్‌ హాప్‌ గెటప్‌ చూశారా?

మరిన్ని వార్తలు

భళ్లాలదేవ రానా కొత్త అవతారమెత్తారు. ఈ సారి అలాంటిలాంటి అవతారం కాదండోయ్‌. ర్యాప్‌ సింగర్‌ అవతారమెత్తారు. నటుడిగా విలక్షణ పాత్రల్లో రానాని చూసేశాం. పలు ఈవెంట్స్‌లో స్టేజ్‌పై రానా హోస్టింగ్‌ కూడా చూసేశాం. నిర్మాతగానూ రానా రాణించాడు. ఇక ఇప్పుడు కొత్త అవతారంలో భళా అనబోతున్నాడు మన భళ్లాలదేవ. విశాల్‌, తమన్నా జంటగా నటించిన 'యాక్షన్‌' సినిమాలో ఓ సాంగ్‌ కోసం రానా ఓ ర్యాప్‌ పాడాడు. మాంచి జోష్‌ మీదుండబోతోందట రానా గొంతు కలిపిన ర్యాప్‌.

 

ఈ సినిమాకి హిప్‌ హాప్‌ తమిళ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. రానా ఫ్రెండ్స్‌ లిస్ట్‌ చాలా పెద్దదే అన్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో హిప్‌ హాప్‌ తమిళ కూడా ఉన్నాడు. తన స్నేహితుడి ఎంకరేజ్‌మెంట్‌తోనే భళ్లాలదేవ జోష్‌ ఉన్న ర్యాప్‌ కోసం గొంతు సవరించుకున్నాడు. ఈ విషయాన్ని హిప్‌ హాప్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ రానాకి థాంక్స్‌ చెప్పాడు. హిప్‌ హాప్‌ ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన రానా ఆ ఛాన్స్‌ ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు మిత్రమా అని రిప్లై ఇచ్చాడు. సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే పూరీ చేతుల మీదుగా విడుదలైన తెలుగు వెర్షన్‌ 'యాక్షన్‌' ట్రైలర్‌కి విశేష స్పందన లభించింది. మరోవైపు రానా 'విరాటపర్వం' సినిమాలో నటిస్తున్నాడు. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకుడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS