పూరీ జగన్నాధ్‌కీ, గోవాకీ విడదీయరాని సంబంధం ఉంది. ఆయన సినిమాల్లో తప్పకుండా గోవా లొకేషన్స్‌ని చొప్పిస్తూ ఉంటారు. తాజాగా గోవాని కొడుకు ఆకాష్ పూరీ కోసం కూడా వాడేసుకోనున్నారు పూరీ జగన్నాధ్. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ ఆకాష్ పూరీ సినిమా 'రొమాంటిక్' కోసం వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పూరీ కేవలం నిర్మాత మాత్రమే దర్శకుడిగా అనిల్ పాడూరిని పరిచయం చేస్తున్నాడు. కథ, స్క్రీన్‌ప్లే పూరీవే అనుకోండి. ఈ సంగతి అటుంచితే, ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోందట. గోవాలోని అందమైన లొకేషన్స్‌ని కొన్ని రొమాంటిక్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా వాడబోతున్నారట. అలాగే ఇక్కడే సినిమాకి సంబంధించి పతాక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరగనుందట. బీచ్‌లో ఓ డిఫరెంట్ ఫైట్ సీన్ ప్లాన్ చేశారట.
హీరో, హీరోయిన్‌తో పాటు, చిత్రయూనిట్ అంతా గోవాలోనే సందడి చేస్తోంది. ఆకాష్ పూరీ సరసన ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా వదిలిన ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పోస్టర్ కాక పుట్టించిన సంగతీ తెలిసిందే. ఇక సినిమాలో ఇలాంటి స్పెషల్ రొమాంటిక్ ట్రీట్ చాలానే ఉండనుందట. పూరీ కనెక్స్ట్ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'తో సూపర్ హిట్ కొట్టి జోష్ మీదున్న పూరీ, తనయుడికి కూడా అలాంటి ఓ హిట్ అందించాలనే తపనతో ఉన్నాడు 'రొమాంటిక్' చిత్రంతో. చూడాలి మరి, పూరీ ఆశలు నెరవేరుతాయో.? లేదో.?