బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోలతో పాటు, నితిన్ తదితర యంగ్ హీరోస్‌తోనూ నటించి, తెలుగుతో పాటు, సౌత్‌లో పలు భాషల్లో పాపులర్ నటిగా పేరు తెచ్చుకుంది ప్రియమణి. సహజ నటనతో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల సత్తా ఉన్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తోంది. బుల్లితెరపై ఓ డాన్స్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ మధ్యనే ఓ సినిమాకి సైన్ చేసిందనీ సమాచారమ్. అయితే, తాజాగా రానా హీరోగా తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' సినిమాలో ప్రియమణి ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోందంటూ గాసిప్ బయటికి వచ్చింది.
90ల కాలం నాటి పీరియాడిక్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బెల్లి లలిత అనే పాత్రలో ప్రియమణి నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఆషా మాషీ పాత్ర కాదిది. రియల్ లైఫ్ క్యారెక్టర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న తరుణంలో తెలంగాణాలో బెల్లి లలిత అనే ఫోక్ సింగర్ ఉండేది. 19 ఏళ్లకే ఈమె విప్లవ గాయనిగా పాపులారిటీ దక్కించుకుంది. అయితే దురదృష్టవశాత్తూ, ఈమె గ్యాంగ్‌స్టర్ నయీం చేతికి చిక్కి అత్యంత కిరాతకంగా హత్యకు గురైంది. ఈ పాత్ర ఆధారంగానే 'విరాటపర్వం' సినిమాలో ఓ పాత్రను డిజైన్ చేశారట. ఆ పాత్ర కోసం ప్రియమణిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నక్సలిజం నేపథ్యంలో ఆశక్తికరమైన కథనంతో సాగే చిత్రమిది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి టబు మరో కీలక పాత్ర పోషిస్తోంది.