సాహో ప్లేస్‌లో ర‌ణ‌రంగం.

By iQlikMovies - July 16, 2019 - 20:00 PM IST

మరిన్ని వార్తలు

ఆగ‌స్టు 15న విడుద‌ల కావాల్సిన సాహో సినిమా వాయిదా ప‌డ‌డంతో.. ఇప్పుడు ఆ స్థానంలోకి ర‌ణ‌రంగం వ‌చ్చి కూర్చుంది. శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌మిది. కాజ‌ల్ క‌థానాయిక‌. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని ఆగ‌స్టులో విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావించింది. అయితే ప్ర‌భాస్ సినిమా కూడా ఆగ‌స్టులోనే ఉండ‌డంతో.. నిర్ణ‌యాన్ని ప‌క్క‌న పెట్టింది. సాహో వెళ్లాకే ర‌ణ‌రంగం తీసుకురావాల‌ని శ‌ర్వా కూడా ఫిక్స‌య్యాడు.

 

ఎప్పుడైతే సాహో వాయిదా ప‌డిందో - శ‌ర్వా సినిమాకి దారి దొరికిన‌ట్టైంది. అప్ప‌టిక‌ప్పుడు ర‌ణ‌రంగం టీమ్ విడుద‌ల తేదీ ఫిక్స్ చేసేసింది. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 15న విడుద‌ల చేస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించింది. సాధార‌ణంగా శుక్ర‌వారం సినిమాలు విడుద‌ల అవుతాయి. ఆగ‌స్టు 15 గురువారం వ‌చ్చింది. సెల‌వు రోజు కావ‌డం క‌లిసొచ్చే విష‌యం. ఈ సెల‌వురోజుని సాహో క్యాష్ చేసుకోవాల‌నుకుంది. కానీ.. శ‌ర్వానంద్‌కి ఆ అవ‌కాశం ద‌క్కింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS