నెగటివ్ కామెంట్స్ పై సీరియస్ అయిన సందీప్ కిషన్..!

మరిన్ని వార్తలు

ప్రస్థానం చిత్రంతో నటుడిగా గుర్తింపు పొంది, తరువాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో అందరినీ ఆకట్టుకుని తనకంటూ ఓ క్రేజ్ ని సంపాదించుకున్నాడు సందీప్ కిషన్. ఆ తరువాత తెలుగులో పెద్దగా హిట్లు లేకపోవడం తో తమిళం లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుని మా నగరం, మాయ వనం చిత్రాలతో అక్క కూడా తన ఉనికి చాటుకున్నాడు. అయితే కొద్ది గ్యాప్ తరువాత మళ్ళీ తెలుగులో హిట్టు కొట్టడానికి ఓ వెరైటీ కాన్సెప్ట్ తో ముందుకొచ్చాడు సందీప్.

 

సొంత నిర్మాణం లో సందీప్ నటించిన తాజా చిత్రం 'నిను వీడని నీడను నేనే'. ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. హారర్ కామెడీ థ్రిల్లర్ నేపధ్యం లో కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రానికి నెటిజెన్ల కూడా బాగానే సపోర్ట్ చేశారు. కానీ ఒకటి రెండు వెబ్ సైట్లలో మాత్రం కొంచెం నెగటివ్ గా ఈ చిత్రాన్ని ప్రచారం చేశారు.

 

ఓవర్సీస్ లో ఈ చిత్రం ఆశించినంత కలెక్షన్లు సంపాదించుకోలేకపోయిందని ప్రచారం చేసిన ఓ వెబ్ సైట్ పై హీరో సందీప్ కిషన్ ఘాటుగా స్పందించాడు. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ఉంది.. దాని గురించి కూడా రాస్తే బావుంటుందని, సరైన సమాచారం లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దంటూ ఆ వెబ్ సైట్ పై మండిపడ్డాడు. మొత్తానికి ఈ చిత్రం తో అయినా సందీప్ మళ్ళీ దారిలో పడితే మంచిదే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS