గత కొంత కాలంగా అలియా భట్, రణీబీర్ కపూర్ మధ్య డీప్ లవ్ ట్రాక్ నడుస్తోందన్న వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. అంతలా ఈ ప్రేమ జంట చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతుంటారు మరి. ఇక తాజా వార్తల్లోకి వెళితే, మరి కొద్ది రోజుల్లోనే ఈ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనున్నారట. ఆల్రెడీ ఇరు కుటుంబాల వారూ వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనీ తెలుస్తోంది. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ కూడా జరగనుందట. ప్రస్తుతం అలియా భట్ నార్త్‌లోనే కాదు, సౌత్‌లో కూడా బిజీగా ఉంది.
ప్రెస్టీజియస్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'లో అలియా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో అలియా భట్ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర', 'సడక్ 2' చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీలైనంత త్వరలో తను కమిట్ అయిన ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసుకుని, అలియా భట్ వివాహానికి సిద్ధం కానుందనీ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అలాగే రణ్‌బీర్ కూడా. తూచ్.! ఇది గాలి వార్తే అయ్యుండొచ్చు.. అని కొట్టి పారేయలేం. ఎందుకంటే, ఈ రోజుల్లో గాలి వార్తల్ని కూడా మన సెలబ్రిటీలు పక్కాగా నిజం చేసేస్తున్నారు.
అలా ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ జంటలు పెళ్లి పీటలెక్కేయడం మనం చూశాం. ఐశ్వర్య - అభిషేక్, దీపికా - రణ్‌వీర్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పాపులర్ సెలబ్రిటీలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలాగే త్వరలో అలియా, రణ్‌బీర్ కూడా ఒక్కటి కానున్నారేమో చూడాలి మరి.