'బాహుబలి'తో బాలీవుడ్‌కి తెలుగు సినిమా సత్తా చూపించిన రాజమౌళితో కలిసి పని చేయాలని చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఉవ్విళ్లూరిన సంగతి తెలిసిందే. చిన్న పాత్రయినా చాలు, రాజమౌళి సినిమాలో కనిపించాలంతే.. అనే తమ అభిప్రాయాన్ని చాలా మంది స్టార్స్ వ్యక్త పరిచారు. ఇక 'బాహుబలి'లో హీరోయిన్స్ అయిన తమన్నా, అనుష్కలని చూసిన హీరోయిన్లు ఎవరైనా అలాంటి పాత్రల్లో తాము కూడా నటించి ఉంటే బాగుండని ఒక్కసారైనా అనుకోకుండా ఉండరు.
అయితే, అందరికీ అలాంటి ఛాన్స్ రాదు కదా. కానీ, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌కి ఆ ఛాన్స్ రానే వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళితో కలిసి తాను పని చేయాలనుకుంటున్నట్లు అలియా ఒక సందర్భంలో తెలిపింది. ఆ కోరిక 'ఆర్‌ఆర్‌ఆర్'తో తనకు ఫుల్ ఫిల్ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు, తన పాత్రలోని డెప్త్ అర్ధం చేసుకునేందుకు తెలుగు భాషపై పట్టు సాధిస్తోందట. ప్రత్యేక ట్యూటర్‌ని పెట్టుకుని తెలుగు నేర్చుకుంటోందట.
ఈ సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్‌కి జోడీగా అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సహజంగానే రాజమౌళి సినిమాల్లో హీరోయిన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. 'బాహుబలి'తో ఆ విషయం బాగా ప్రూవ్ అయ్యింది. సో 'ఆర్‌ఆర్‌ఆర్'లోనూ హీరోయిన్స్ క్యారెక్టర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుదనడం అతిశయోక్తి కాదేమో. మరోవైపు కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ జోడీగా విదేశీ భామ ఎమ్మా రాబర్ట్స్‌ని ఎంచుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం.