అలనాటి మేటి నటి సావిత్రి స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న తరుణంలోనే సోదరి పాత్రలు కూడా పోషించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోల సరసన నటించి, మళ్లీ వారికే చెల్లెలి పాత్రల్లోనూ నటించి మెప్పించారు. ఇప్పుడెందుకీ విషయం అనుకుంటున్నారా? ఈ తరం నటి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తన స్టార్‌డమ్‌ని పెంచుకుంటోంది. ఆమె మరెవరో కాదు, ఐశ్వర్యా రాజేష్.
ఇటీవల 'కౌసల్యా కృష్ణమూర్తి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఐశ్వర్యా రాజేష్ తమిళంలో స్టార్ నటి. పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం అక్కడ ఆమె బిజీయెస్ట్ హీరోయిన్. అయినా ఓ పక్క హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే, సోదరి పాత్రలు కూడా పోషిస్తోంది. తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ సోదరి పాత్ర పోషిస్తోంది. పాత్ర నచ్చితే హీరోయిన్‌గానే కాదు, చిన్న పాత్రలోనైనా నటిస్తానని చెప్పడానికి ఉదాహరణగా చెప్పేందుకు ఐశ్వర్యా రాజేష్.
ఆ మహానటి సావిత్రిని ఇన్సిప్రేషన్‌గా తీసుకున్నట్లుంది. ఇటీవల విడుదలైన 'కౌసల్యా కృష్ణ మూర్తి' ఓ మోస్తరు పోజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ లేడీ క్రికెటర్‌గా నటించిన సంగతి తెలిసిందే. మంచి కథ సెట్ అయితే, తెలుగులో డైరెక్ట్ మూవీ చేసేందుకూ సిద్ధంగా ఉన్నానంటోంది ఐశ్వర్యా రాజేష్.