రన్బీర్ ‘దత్’గా వచ్చేస్తున్నాడు

మరిన్ని వార్తలు

రన్బీర్ కపూర్ తాజా చిత్రం అయిన సంజయ్ దత్ బయోపిక్ కి సంబందించిన విడుదల తేది బయటకి వచ్చేసింది.

వచ్చే ఏడాది మధ్యలో అనగా జూన్ 29న  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం కోసం అందరు ఎదురుచూస్తుండగా ఈ విడుదల తేది వార్త ఇటు రన్బీర్ అభిమానులకి అటు సంజయ్ దత్ అభిమానులకి ఒక తీపి కబురులా చేరింది.

 

అసలు సంజయ్ దత్ వంటి రాక్ స్టార్ జీవితాన్ని తెరపైన తీయడమే ఒక సవాలు అలాంటిది రన్బీర్ వంటి హీరోని ఆ పాత్రలో చూడనుండడం మరొక విశేషం. ఇవ్వన్ని ఒక్క ఎత్తు అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది ఫ్లాప్ అంటూ ఎరుగని రాజ్ కుమార్ హిరానీ.

ఇక ఈ చిత్రంలో అనేక విశేషాలతో పాటుగా వివాదాలు కూడా ఉండబోతున్నాయి అన్న ప్రచారం అయితే ఉంది. అయితే సంజయ్ దత్ తన జీవితంలో జరిగిన అంశాలని ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పి మరి ఈ చిత్ర యూనిట్ కి సహకరించాడట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS