రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ జంటగా రూపొందిన జగ్గా జాసూస్ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో ఒక పెద్ద కాంట్రవర్సీ ఈ చిత్రానికి చుట్టుకుంది.
తెలియవస్తున్న వివరాల ప్రకారం, వెటరన్ హీరో గోవిందా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేశాడు. అయితే తరువాత కథలో జరిగిన మార్పుల వల్ల ఆ పాత్రని పూర్తిగా తీసేయడం జరిగింది.
ఈ విషయమై గోవిందా చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో దిద్దుబాటు చర్యల్లో భాగంగా రణబీర్ కపూర్ నటుడు గోవిందాకి క్షమాపణలు చెప్పాడు. మారిన కథ ప్రకారం ఈ మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది అని తెలిపాడు.
తాను ఈ చిత్రానికి నిర్మాతని కూడా అవ్వడంతో తమని పెద్ద మనసు చేసుకుని మన్నించాలి అని రణబీర్ ప్రెస్ ద్వారా ఆయనకీ విజ్ఞప్తి చేశాడు.