‘రంగ్‌ దే’ ఫస్ట్‌ లుక్‌: అర్జున్‌, అను.. అదరగొట్టేశారు.!

మరిన్ని వార్తలు

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రంగ్‌ దే’ సినిమా నుంచి ఇప్పటికే మోషన్‌ పోస్టర్‌ బయటకొచ్చింది. అయితే, కాస్త డల్‌గా అన్పించింది ఆ మోషన్‌ పోస్టర్‌. ‘భీష్మ’ సక్సెస్‌తో మంచి జోరు మీదున్న నితిన్‌, ఆ సక్సెస్‌ గ్రాఫ్‌ని ఇంకా పెంచుకోవాలని చూస్తున్నాడు.. ఆ గ్రాఫ్‌ ‘రంగ్‌ దే’తో మరింత పెరుగుతుందన్న నమ్మకంతో నితిన్‌ వున్నాడు. మరోపక్క తొలిసారిగా నితిన్‌ సరసన జతకడ్తోంది ‘మహానటి’ కీర్తి సురేష్‌ ఈ సినిమా కోసం. మోషన్‌ పోస్టర్‌ సంగతి పక్కన పెడితే, తాజాగా విడుదలైన పోస్టర్‌లో నితిన్‌, కీర్తి సురేష్‌ సూపర్బ్‌గా కనిపిస్తున్నారు. నితిన్‌ స్టైలిష్‌ లుక్‌, కీర్తి సురేష్‌ నేచురల్‌ లుక్‌.. ఈ పోస్టర్‌లో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

 

నితిన్‌ ఈ సినిమాలో ‘అర్జున్‌’ అనే కుర్రాడిలా నటిస్తోంటే, కీర్తి సురేష్‌ పాత్ర పేరు అను. అర్జున్‌, అను పాత్రల పరిచయం పోస్టర్‌ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంది. వెంకీ అట్లూరి ‘తొలి ప్రేమ’తో సూపర్‌ హిట్‌ కొట్టినా, ‘మిస్టర్‌ మజ్ఞు’తో ఫెయిల్యూర్‌ చవిచూశాడు. ఈ నేపథ్యంలో ‘రంగ్‌ దే’ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు వెంకీ అట్లూరి. పోస్టర్‌ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయనడం అతిశయోక్తి కాదేమో. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS