ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ పేరు పియా బాజ్‌పాయ్. తమిళ డబ్బింగ్ చిత్రం 'రంగం'తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. జీవా హీరోగా తెరకెక్కిన 'రంగం' సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. దాంతో అమ్మడికి ఓ మోస్తరు క్రేజ్ వచ్చినా, అవకాశాలు మాత్రం రాలేదు. ఇంకా తెలుగులో అవకాశాలు దక్కించుకోవడానికి ఎదురు చూస్తున్నానని చెబుతోంది.
అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోందట. బాలీవుడ్‌లోనూ ఒకటీ అరా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్స్ కంటికి చిక్కే ఈ చిన్నది తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. వైట్ అండ్ వైట్ హాట్ కాస్ట్యూమ్‌లో సెక్సీ ఎక్స్ప్రెషన్తో కుర్రాళ్లకు స్పెషల్ కిక్ ఇస్తోందీ పిక్.