ఒకప్పుడు హీరోయిన్లు ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు కెమెరాకి చిక్కేవారే కాదు. బేబీ బంప్‌తో ఉన్న పిక్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడేవారు. కానీ ఇప్పుడు ట్రెండింగ్‌లో భాగంగా బేబీ బంప్ పిక్స్నీ నిర్మొహమాటంటా ప్రదర్శించి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కిక్కెక్కించే ఫిగర్‌తో హాట్ హాట్‌గా అందాలారేసేసిన ముద్దుగుమ్మలు కూడా ప్రెగ్నెన్సీ టైంలో తమ తమ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొత్తగా మురిసిపోతున్నారు. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్స్పోజింగ్ కూడా ఇప్పుడో ట్రెండ్.
అందుకే ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతోంది ముద్దుగుమ్మ సమీరారెడ్డి. ఈ ముద్దుగుమ్మ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో 'నరసింహుడు', 'అశోక్' చిత్రాలతో పాటు, మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవ' సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. ఎన్టీఆర్‌తో పెళ్లి అంటూ ఆ టైంలో గాసిప్స్ వచ్చాయి. కానీ ఓ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది సమీరా. చాలా కాలం తర్వాత తాజాగా సోషల్ మీడియాలో బేబీ బంప్‌తో హాట్ సెల్ఫీ దిగి ఫ్యాన్స్‌కి హాయ్ చెప్పింది. సమీరా దంపతులకు ఆల్రెడీ నాలుగేళ్ల బాబు ఉన్నాడు.