పూరీ జగన్నాధ్‌ డబుల్‌ ధమాకా.!

By Inkmantra - March 12, 2019 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

'ఇస్మార్ట్‌ శంకర్‌' హవా మామూలుగా లేదండోయ్‌. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ డే నుండీ ఓ రేంజ్‌లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతోందన్న విషయాన్ని తెలియజేస్తూ ఛార్మి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. సినిమా షూటింగ్‌తో పాటు, ఎట్‌ ఏ టైమ్‌ ఎడిటింగ్‌ పనులు కూడా పూర్తయిపోతున్నాయట. జునైద్‌ పర్యవేక్షణలో ఈ ఎడిటింగ్‌ కార్యక్రమాలు సాఫీగా జరుగుతున్నాయనీ ఛార్మి చెప్పింది. 

 

'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీని పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో పూరీ జగన్నాధ్‌తో కలిసి ఛార్మి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్‌ గాళ్స్‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ రామ్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ సంగతిలా ఉంటే, మరోవైపు పూరీ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కుతోన్న 'రొమాంటిక్‌' సినిమా షూటింగ్‌ కూడా గోవాలోనే జరుగుతోంది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్‌ కథ, మాటలు అందించారు. 

 

గోవాలో పక్క పక్కనే ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ సమాంతరంగా జరుగుతున్నాయట. ఈ సినిమాలో ఆకాష్‌ పూరీ సరసన కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. 'మెహబూబా'తో నేహా శెట్టిని తెలుగు తెరకు పరిచయం చేసిన పూరీ, 'రొమాంటిక్‌'తో కేతికా శర్మను పరిచయం చేస్తున్నాడు. ఇకపోతే పూరీ జోరు చూస్తుంటే, అతి త్వరలోనే ఈ రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఉన్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS