కిరీటం రంగమ్మత్తదే.!

మరిన్ని వార్తలు

పాత్ర పేరుతో నటీనటులు పాపులర్‌ కావడం కొత్తేమీ కాదు. కానీ ఈ ఏడాది విడుదలైన 'రంగస్థలం' సినిమాలోని రంగమ్మత్త పాత్రకి వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఓ సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ ఏకంగా హీరోయిన్‌ క్యారెక్టర్‌నే డ్యామినేట్‌ చేయడమంటే చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. 'రంగమ్మత్త' పాత్ర ద్వారా అనసూయకు దక్కింది. 

 

 

బహుశా ఇలాంటి పాత్ర అనసూయకు ఎంత ప్రయత్నించినా కెరీర్‌లో మరోసారి దొరక్కపోవచ్చు. సినిమా విడుదలై ఇన్ని నెలలు గడిచినా, ఆ పాత్ర ప్రభావం అనసూయపై తగ్గలేదు. ఎంతో మందిని పరిశీలించి చిట్ట చివరకు అనసూయను ఆ పాత్ర కోసం ఎంచుకున్నాడు సుకుమార్‌. పాత్ర ఎంపికపై పెట్టిన దృష్టినే, పాత్ర చిత్రీకరణపై కూడా పెట్టాడు.

 

అంత అద్భుతంగా చిత్రీకరించాడు ఆ పాత్రను. అలాగే అనసూయ కూడా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. పూర్తి న్యాయం చేసింది. అందుకే ఇయర్‌ ఆఫ్‌ ది సపోర్టింగ్‌ రోల్‌ అంటే అది రంగమ్మత్తకే దక్కుతుందనడంలో అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అనసూయ 'ఎఫ్‌ 2', 'యాత్ర' చిత్రాల్లో నటిస్తోంది. 'ఎఫ్‌ 2'లో ఐటెం సాంగ్‌లో నటించింది. సంక్రాంతికి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దివంగత వైఎస్సార్‌ బయోపిక్‌ 'యాత్ర' ఫిబ్రవరిలో విడుదల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS