జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 'మహానటి' చిత్రం ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేశారు. అయితే, ఉత్తమ నటుడి అవార్డు 'రంగస్థలం' సినిమా కోసం చిట్టిబాబుకి దక్కాలనీ మెగా అభిమానులు గోల చేస్తున్నారు. ఈ విషయంలో చిట్టిబాబుకు అన్యాయం జరిగిందనీ, ఓ పెద్ద నిర్మాత ఈ విషయమై ఢిల్లీ స్థాయిలో లా బీయింగ్ చేసి, అంతా చెడగొట్టాడనే ప్రచారం జరుగుతోంది.
అయితే, అదంతా ఉత్తదే అంటున్నారు ఇంకో పక్క. కానీ, చిట్టిబాబుకు అన్యాయం జరిగిందనీ, జాతీయ స్థాయిలో ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించకపోతే, భవిష్యత్తులో స్టార్ హీరోలు అలాంటి అటెంప్ట్స్ చేయబోరనీ, 'రంగస్థలం' ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ చిత్రమనీ ముందే ఊహించామని అభిమానులు వాదిస్తున్నారు. అయితే ఇతరులు ఈ వాదనను కొట్టి పాడేస్తున్నారు.
అభిమానుల్లో ఆ మాత్రం అసహనం ఉండడాన్ని తప్పు పట్టలేం కానీ, చరణ్ ఈ విషయంలో లైట్‌గానే ఉన్నాడు. అంతేగా మరి, అవార్డులు వచ్చిన సినిమాలను సోషల్ మీడియా వేదికగా చరణ్ అభినందించాడు. ఉత్తమ ఆడియోగ్రఫీ లిస్టులో 'రంగస్థలం'కు అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనింగ్.. ఇలా పలు కేటగిరిల్లో 'మహానటి'కి అవార్డులు పోటెత్తాయి. ఉత్తమ మేకప్ కేటగిరీలో 'అ' చిత్రం అవార్డు దక్కించుకుంది. ఉత్తమ స్క్రీన్‌ప్లే కేటగిరిలో సుశాంత్ నటించిన 'చిలసౌ' నేషనల్ అవార్డు దక్కించుకోవడం విశేషం.