'రంగస్థలం' విడుదలై 50 రోజులు గడుస్తున్నా ఇంకా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఫస్ట్ వీక్ దాటి సెకండ్ వీక్‌కే సినిమా ధియేటర్స్ నుండి మాయమైపోతున్న రోజులివి. అలాంటిది 50 రోజులుగా ఏకధాటిగా ప్రదర్శితమవుతూ, నిర్మాతలకు లాభాల మీద లాభాలు తెచ్చిపెడుతుంది. 81 డైరెక్ట్ సెంటర్స్‌లో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ సెంటర్స్‌లో సినిమా విడుదలైనా కానీ ధియేటర్స్‌లో ఇంకా హవా కొనసాగుతుండడం విశేషం. ఈ సందర్భంగా 'రంగస్థలం' 50 రోజుల ఫంక్షన్‌కి రంగం సిద్ధం చేస్తోందట చిత్ర యూనిట్. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌తో సహా మెగా ఫ్యామిలీ హీరోలంతా ఈ వేడుకలో పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది 'రంగస్థలం'. 125 కోట్లకు పైగా షేర్స్ సాధించింది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'రంగస్థలం'.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా వీర దున్నుడు దున్నేశాడు ఈ సినిమాతో రామ్‌చరణ్. చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సమంతకు కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందింది. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన అనసూయ, ఆది పినిశెట్టికి కూడా మంచి పేరొచ్చింది. 2018కే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'రంగస్థలం'. ఇప్పట్లో 'రంగస్థలం'ని బ్రేక్ చేసే సినిమా లేదంటే అతిశయోక్తి లేదు.