రంగస్థలం చిత్రం 10రోజుల కలెక్షన్స్

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నది. విడుదలైన 10 రోజుల్లో ఈ చిత్రం దాదాపుగా బాహుబలేతర రికార్డులని తిరగరాస్తూ దూసుకుపోతున్నది.

ఈ 10 రోజుల్లో రంగస్థలం రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు రూ 67 కోట్ల (షేర్) మేర వసూలు చేసింది. ఇది ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులని చెరిపేసి కొత్త రికార్డు సృష్టిస్తున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ 93కోట్ల మేర షేర్ వసూలు చేయడంతో ఇంకొక రెండు రోజుల్లో ఈ చిత్రం రూ 100కోట్ల షేర్ చేసే అవకాశం ఉంది.

ఇక గ్రాస్ విషయంలో ఈ సినిమా సుమారు రూ 150 కోట్ల మార్క్ వరకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. అలాగే ఈ సినిమా తెలుగు చిత్రపరిశ్రమలో అత్యధిక వసూళ్ళు (బాహుబలి కాకుండా) సాధించిన చిత్రం నిలబడిపోనుంది.  

మొత్తానికి రామ్ చరణ్ రంగస్థలం మెగా అభిమానుల్లో అలాగే మెగా ఫ్యామిలీలో ఆనందం నింపింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS