'రంగస్థలం' రేంజ్‌ ఎంత?

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ పవర్‌ చూపించే రోజు రానే వచ్చింది. వచ్చాడు 'రంగస్థలం'తో. మగాడు అనిపించుకున్నాడు. అలాంటి ఇలాంటి టాక్‌ కాదు. సూపర్‌ హిట్‌ టాకే వస్తోంది 'రంగస్థలం' సినిమాకి. దాంతో మెగా పవర్‌స్టార్‌ పవర్‌ చూపించేశాడు. విడుదలకు ముందు ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చ. 

అందుకు ఏమాత్రం తగ్గకుండానే ఫస్ట్‌ డే కలెక్షన్స్‌, టాక్‌తో దుమ్ము రేపేస్తున్నాడు చరణ్‌. ఎక్కడా నెగిటివ్‌ కామెంట్స్‌ వినిపించడం లేదు. నిడివి కాస్త ఎక్కువైందన్న కామెంట్‌ తప్ప. ఆ కామెంట్‌ సినిమాకి పెద్దగా మైనస్‌ కాకపోవచ్చు. ఇక చరణ్‌ పర్‌ఫామెన్స్‌కి ప్రశంసల జల్లు కురుస్తోంది. తన పర్‌ఫామెన్స్‌తో వన్‌ మ్యాన్‌ షో చేసేశాడు. వార్‌ వన్‌ సైడ్‌ అయిపోయిందంతే. 'బాహుబలి' తర్వాత ఈ స్థాయిలో ఓపెనింగ్స్‌ వచ్చాయి ఈ సినిమాకే. 

సంక్రాంతి టాలీవుడ్‌కి భారీ నిరాశ మిగల్చడమే కాకుండా, ఆ తరువాత ఒకటీ అరా తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు విజయం సాధించలేదు. సమ్మర్‌కి ముందు విడుదలైన 'రంగస్థలం' ఆ లోటు తీర్చింది. సమ్మర్‌కి మంచి బోణీ కొట్టాడు మెగా పవర్‌ స్టార్‌ 'రంగస్థలం'తో. 'చెర్రీ కొట్టాడ్రా గట్టిగా కొట్టాడ్రా..' అనే టాక్‌ తప్ప మరోటి లేదు. దాదాపు వంద కోట్లు ప్రీ రిలీజ్‌ బిజెనెస్‌ అయ్యింది ఈ సినిమాకి. ఇక సినిమా జనంలోకి వచ్చేసింది. 

ఇక ఎంత వసూలు చేస్తుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లో కూడా 'రంగస్థలం' రికార్డు స్థాయిలో దూసుకెళ్లిపోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS