రంగస్థలం మొదటిరోజు వసూళ్ళు ఇవే..

By iQlikMovies - March 31, 2018 - 19:14 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి సంబంధించి తొలిరోజు కలెక్షన్స్ గురించిన సమాచారం పైన అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది.

అయితే దీని పైన అధికారిక సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ 40 కోట్ల (గ్రాస్) వసూలు చేసిందని తెలుస్తున్నది. ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ గమనిస్తే, ఇప్పటివరకు చరణ్ కెరీర్ లో ఇంతటి కలెక్షన్స్ ఏ చిత్రానికి రాలేదు.

ఇక ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో ఈరోజు రేపు కలెక్షన్స్ మొత్తంగా చూస్తే, సుమారు రూ 100 కోట్ల దాటుతుంది అన్న అంచనాలు స్పష్టంగా ఉన్నాయి. దీనితో రంగస్థలం చిత్రం తెలుగు చిత్రాలలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాల జాబీతాలో చోటు దక్కించుకోనుంది.

 

మొత్తానికి బాక్స్ ఆఫీస్ కి మెగా పవర్ చూపించేశాడు రామ్ చరణ్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS