రంగస్థలం కథ కాపీ కొట్టి మోసం చేసిన సుకుమార్..!

మరిన్ని వార్తలు

మూడు రోజుల క్రితం విడుదలైన రంగస్థలం చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్ళని రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నది. ఇదే సమయంలో ఈ చిత్రం మూలకథ పైన ఒక వివాదం వెలుగులోకి వచ్చింది.

అదేమనగా- M గాంధీ అనే ఒక రైటర్ ఉక్కుపాదం అనే టైటిల్ పేరుతో ఒక కథని ఛాంబర్ లో 2010వ సంవత్సరంలో రిజిస్టర్ చేయించాడట. అదే మూలకథని ఆధారం చేసుకుని రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం ఉంది అని సదరు రచయత ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడట.

దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులు దర్శనమిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇంకా తెలియనప్పటికీ, ఈ సినిమా విజయవంతం కావడంతో ఈ వార్తకి ప్రాధాన్యత పెరిగింది.

ఇక ఈ అంశం నిజమేనా? కాదా? అన్న పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS