మెగాపవర్‌ స్టార్‌ నుండి మరో గుడ్‌ న్యూస్‌.!

By iQlikMovies - March 31, 2018 - 13:39 PM IST

మరిన్ని వార్తలు

రామ్‌ చరణ్‌ నటించిన 'రంగస్థలం' సూపర్‌ హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. లేట్‌గా వచ్చినా, లేటెస్టుగా హిట్‌ కొట్టాడు చరణ్‌. ఈ ఏడాదికి బాక్సాఫీస్‌కి మంచి బోనీ కొట్టేశాడు 'రంగస్థలం' సినిమాతో. ఈ టైంలో చరణ్‌ నుండి మరో గుడ్‌ న్యూస్‌ వినిపిస్తోంది. బోయపాటితో చరణ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆల్రెడీ చరణ్‌ తన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా మార్చేశాడు కూడా. 

అయితే బోయపాటితో చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసే యోచనలో ఉన్నాడట చరణ్‌. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసేసి, నెక్స్ట్‌ రాజమౌళి సినిమాతో బిజీ కానున్నాడట. ఎలాగూ బోయపాటి సినిమాలు తొందరగా నిర్మాణం పూర్తి చేసుకుంటాయి. చరణ్‌ కో ఆపరేట్‌ చేస్తే ఆ పని మరింత స్పీడుగా పూర్తవుతుంది. 'రంగస్థలం' సక్సెస్‌ ఇచ్చిన జోష్‌తో చరణ్‌ మరింత స్పీడుగా సినిమాలు చేయాలనుకుంటున్నాడట. అలా దసరాకి బోయపాటి సినిమా కంప్లీట్‌ అయిపోద్ది అనుకుంటున్నారు. 

అదే నిజమైతే, 2017లో చరణ్‌ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ లోటు ఈ సంవత్సరం రెండు సినిమాలతో తీర్చేసినట్లవుతుంది. ఇది నిజంగా మెగా అభిమానులకు పండగలాంటి వార్తే కదా. ఇక ఈ ఏడాదిలోనే రాజమౌళి మల్టీ స్టారర్‌ కూడా పట్టాలెక్కేసే అవకాశాలున్నాయి. ఈ సినిమా కోసం మరో పక్క ఎన్టీఆర్‌ కూడా తనను తాను సంసిద్ధం చేసుకుంటున్నాడు. చరణ్‌తో పాటు, ఎన్టీఆర్‌ కూడా దూకుడు మీదే ఉన్నాడు. 

ఓ పక్క త్రివిక్రమ్‌ సినిమా కోసం ప్రిపేర్‌ అవుతూనే, మరో పక్క చరణ్‌తో మల్టీస్టారర్‌ కోసం కూడా ఎన్టీఆర్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS