ఆస్ట్రేలియాలో సందడి చేయనున్న 'చిట్టిబాబు'

By iQlikMovies - July 12, 2018 - 12:37 PM IST

మరిన్ని వార్తలు

ఇటీవల 'రంగస్థలం' సినిమాతో మెగా పవర్‌ స్టార్‌ మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో అందరికీ తెలియజేశాడు. బాక్సాఫీస్‌ని కరువు తీరా కాసులతో నింపేశాడు. 100 రోజుల సినిమా అనే మాటే మర్చిపోయిన ఈ రోజుల్లో 'రంగస్థలం'తో మళ్లీ అద్భుతాన్ని తిరిగి సృష్టించాడు. ఇటీవలే ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు మరో కొత్త క్రెడిట్‌తో మెగా పవర్‌స్టార్‌ సత్తా చాటబోతున్నాడు.

 

'ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ 2018' పోటీల్లో 'రంగస్థలం' సినిమా పోటీ పడబోతోంది. ఆగష్టులో ఈ ఉత్సవాలు ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు మన చిట్టిబాబుకు ఆహ్వానం అందింది. 'రంగస్థలం' సినిమా ప్రదర్శన రోజు చరణ్‌ ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. ఈ ఏడాది ప్రధమార్ధం మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రంగస్థలం' సినిమా మర్చిపోలేని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చరణ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. నాన్‌ బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టి అత్యధిక వసూళ్లు సాధించిన నెంబర్‌ వన్‌ తెలుగు సినిమాగా నిలిచింది. 

సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటించిన ఈ సినిమా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సృష్టించిన ఓ వెండితెర అద్భుతం. 1980ల కాలం నాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించి, ఊహించని ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. మైత్రీ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS