200 కోట్ల దిశగా 'రంగస్థలం'

By iQlikMovies - April 16, 2018 - 14:27 PM IST

మరిన్ని వార్తలు

మూడు వారాల క్రితం విడుదలైన 'రంగస్థలం' సినిమా ఇప్పటికి 175 కోట్లు గ్రాస్‌ దాటేసింది. ఆల్రెడీ షేర్‌ వంద కోట్లు దాటింది. విడుదలై మూడు వారాలు గడిచినా ఓవర్సీస్‌లో కానీ, ఇండియాలో కానీ ఈ పరుగు ఆగలేదు. ఇప్పటికీ హౌస్‌ఫుల్స్‌ నమోదు కావడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఓవర్సీస్‌లో ఈ వీకెండ్‌లో కూడా మంచి వసూళ్లు నమోదు చేసింది 'రంగస్థలం'. ఇంతవరకూ ఓవర్సీస్‌లో అసలు మార్కెట్టే లేని చరణ్‌కి 'రంగస్థలం'తో ఈ స్థాయిలో రికార్డులు నమోదు చేయడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఈ వారం 'భరత్‌ అనే నేను' రాబోతోంది. అది వచ్చేదాకా 'రంగస్థలం' జోరు ఇలాగే ఉంటుంది. 

ఇదే జోరుతో 200 కోట్ల మార్క్‌ని అందుకుంటుంది అని అంచనా వేస్తున్నారు ట్రేడ్‌ పండితులు. ఆ మార్క్‌ అందుకోగలిగితే, ఒకే భాషలో విడుదలై ఇంత గొప్ప విజయాన్ని అందుకున్న తొలి తెలుగు సినిమాగా 'రంగస్థలం' రికార్డులకెక్కనుంది. 'బాహుబలి'కి ఈ రికార్డు ఉన్నా, తెలుగుతో పాటు, అనేక భాషల్లో ఈ సినిమా విడుదలైంది. 

ఇకపోతే 'ఓవర్సీస్‌ హీరో'సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. ఇండియాలో నెగిటివ్‌ టాక్‌ సంపాదించుకున్న సినిమాలు కూడా మహేష్‌కి ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు రాబట్టాయి. అలాంటి మహేష్‌కి ఇప్పుడు 'రంగస్థలం' టిపికల్‌ టార్గెట్‌గా మారింది. ఈ టార్గెట్‌ని 'భరత్‌ అనే నేను'తో మహేష్‌ చేధిస్తాడో లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS